Header Banner

సోషల్ మీడియా నియంత్రణపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు! ప్రభుత్వానికి తేల్చిచెప్పిన న్యాయస్థానం!

  Fri Feb 21, 2025 23:02        Politics

సోషల్ మీడియా పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అసలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. సోషల్ మీడియాలో పెడుతున్న అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది.. ఇలాంటి పోస్టులు నిరోధించని పక్షంలో వాటిని ప్రత్యర్ధులపై కక్ష సాధింపు కోసం వినియోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది..


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 


వ్యక్తులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటానికి చట్టం అనుమతి ఇస్తుంది.. కానీ, ఆ స్వేచ్చను వ్యక్తుల ప్రతిష్టను దెబ్బ తీయటానికి వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.. ఈ పోస్టుల నిరోధానికి ఏ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో ఆ వివరాలు తమ ముందు ఉంచాలని ఏపీ సర్కార్కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.. కాగా, పలు సందర్భాల్లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు.. ఇలా ఎవ్వరినీ వదలకుండా.. సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్న విషయం విదితమే..

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #socialmedia #post #petetion #highcourt #judgement #todaynews #flashnews #latestupdate